Futuristic Rayalaseema
About Leader
Job Portal
How to apply
kjr
KJ Reddy
Managing Director of KJR Group
కే.జె.రెడ్డి గారి జీవిత విషయాలు
  • శ్రీ కే జె రెడ్డి గారు వ్యవసాయ కుటుంబానికి సంబందించిన జగదుర్తి గ్రామం,ధోన్ మండలం,కర్నూలు జిల్లా కి చెందిన వారు.
  • అయన 1984వ సంవత్సరంలో కడప జిల్లాలోని పులివెందులలో వై.స్.రాజారెడ్డి కలశాలలో డైరీ సైన్స్ లో తన డిగ్రీ పట్టా ని పొందారు.
  • కే.జె.ర్ గారు 1986లో మెడికల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా తన వృత్రిని ప్రారంభించారు.ఆయన తన వృత్రిలో చాల అత్యున్నత స్థాయి కి ఎదిగారు,ఎన్నో అవార్డులని సొంతం చేసుకున్నారు
  • ఆ తరవాత సొంత వ్యాపారం చెయ్యాలనే ఆలోచన తో థానే కే.జె.ర్ గ్రూప్స్ పేరుతో ఒక సంస్థ ని స్థాపించి రియల్ ఎస్టేట్,ఎలక్ట్రానిక్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టి విజయాన్ని పొందారు.
  • అయన తన సంస్థ ద్వారా మార్చ్,2106 లో ఎలక్ట్రానిక్స్ పార్కు ని మరియు ఫుడ్ పార్కు ని ప్రారంభం చేశారు.
  • అయన సమాజం పట్ల మరియు ప్రజల పట్ల దయా గుణం కలిగిన వారు ,అయన తన ఫౌండేషన్ ద్వారా పోలియో బాధితులాలకు మరియు ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు ఎంతో సేవ చేశారు.

విజయ కేతనాలు:

  • kjreddy

    1995

    1986-1995 మధ్య కాలంలో తన సేల్స్ లో తాను చూపించిన ప్రతిభకి ఎన్నో వెండి మరియు బంగారు పథకాలను పొందారు.

  • 1998

    1998లో రాగ మయూరి బిల్డర్స్ ని స్థాపించి ఇప్పటి వరకు కర్నూల్ నగరం మరియు నగర శివార్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25 వెంచర్స్ ని నెలకొల్పారు.

    Raaga Mayuri Bulders
  • 2007

    2007లో తన పేరిట "కే.జే.ర్ ఫౌండేషన్" ను స్థాపించి,దీని ద్వారా పోలియో బాధితులకు,మహిళలకు సహాయం చేసారు అంతే కాక విద్య మరియు వైద్యంలో,పర్యావరణ మరియు సామజిక కార్యక్రమాలలో సేవ చేసారు. Click Here

  • 2010

    2008-2010లో కర్నూల్ నగరంలో ఐటీ మరియు ఐటీయేతర సంస్థల ఏర్పాటుకు ఒక ప్రత్యేకమైన ఆర్థిక మండలాన్ని స్థాపించారు.

  • 2014

    2014 లో టిడిపి పార్టీ పాణ్యం నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరించి మెజారిటీ ఎం.పీ.టీ.సీ మరియు జ.డ్పీ.టీ.సీ సభ్యుల గెలుపుకు దోహదపడ్డారు. Click Here

  • 2015

    2015లో కర్నూల్ కు అతిదగ్గర్లో ఒక మెగా ఫుడ్ పార్కుకి పునాది వేశారు,ఈ పార్కు ద్వారా 2017చివరి నాటికీ 10,000మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందనున్నారు మరియు ఒక లక్ష మంది రైతులకి లాభం కలగనుంది. Click Here

  • 2016

    2016 మార్చిలో ఒక మెగా ఎలక్ట్రానిక్స్ పార్కుకి శంకుస్థాపన చేసారు,ఈ ప్రాజెక్టు ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా మరియు 25వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కలగనుంది. Click Here

  • 2017

    ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతూ, 2017లో రానున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. Click Here

  • Nov
    2017

    విజయవంతంగా రాయలసీమ జాబ్ పోర్టల్ ప్రారంభం Click Here

  • June
    2017

    ప్రభుత్వ ప్రతినిధులైన ఎం.యల్.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీ లను మరియు హైకోర్ట్ జడ్జిలను,ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను, దాదాపు 100మందికి పైగా పారిశ్రామికవేత్తలను సమావేశ పరిచి సీమలో పరిశ్రమల స్థాపనకు ఒక నమూనా ప్రణాళికను ఏర్పాటు చేపించడం. Click Here


ఔత్సహిక పారిశ్రామిక వేత్త,అసమాన ప్రతిభాశాలి, నిత్యకృషీవలుడు శ్రీ కేజే రెడ్డి గారు:

కేజే రెడ్డి.. రాయలసీమ ప్రాంతంలో కానీ, మరీ ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఈ పేరు తెలియని వారు బహుశా ఎవరూ ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. కేజే రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది. అయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అయన సాధించిన విజయాలు కష్టపడి పైకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక ప్రేరణ లాంటివి.

కర్నూల్ జిల్లా డోన్ మండలంలోని జగదుర్తి గ్రామానికి చెందిన కేజే రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. ప్రాథమిక విద్యాభ్యాసానికి తన స్వగ్రామంలోనే పూర్తి చేసిన ఆయన కడప జిల్లా పులివెందులలోని వైస్ రాజా రెడ్డి కాలేజీ నుంచి 1984 వ సవంత్సరంలో డైరీ సైన్స్ లో బీఎస్సీ పట్టభద్రులైనారు. ఆ తర్వాత కేజే రెడ్డి గారు మెడికల్ సేల్స్ రిప్రజంటేటివ్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, చేసే పనిపట్ల అంకితభావం చూపే తత్వమున్న ఆయన కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే ఆయన సమాజంలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాందించగలిగారు. తను పనిచేసే కంపెనీ లో రీజినల్ మేనేజర్ హోదాను సంపాందించారు. ఈ క్రమంలోనే ఆయనకు పారిశ్రామికవేత్తగా మారాలనే గట్టి ఆలోచన వచ్చింది. తన ఆలోచనను కేజే రెడ్డి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టారు. కంప్యూటర్, కంప్యూటర్ విడిభాగాలకు సంబందించిన డీలర్ షిప్ ను ఆయన తీసుకున్నారు. డీలర్ షిప్ తీసుకున్న కొద్దీ కాలంలోనే మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. కంపెనీ పెట్టిన సేల్స్ టార్గెట్ ను అలవోకగా సాధిస్తూ ఎన్నో ప్రశంసా పత్రాలను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత గోద్రెజ్ కంపెనీ కి చెందిన డీలర్ షిప్ ను తీసుకొని రాయలసీమ అంతటా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.

వ్యాపారంలో తాను సంపాందించిన ధనంతో కే.జే.ఆర్ గ్రూప్ ను ప్రారంభించి తన సామర్జ్యాన్ని వివిధ రకాలైన రంగాలకు విస్తరించారు. రియల్ ఎస్టేట్ రంగం, విద్యా రంగం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టి విజయాన్ని సాధించారు. తమ అభిమానులు, మిత్రులు ప్రేమతో పిలుచుకునే కే.జే.ఆర్ ఐన కేజే రెడ్డి సామజిక సేవలో కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందరో పేద వాళ్లకు తమ సంస్థ తరపున ఆర్ధిక సాయం చేశారు. ఇంతటితో ఆగకుండా పోలియో వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాల్ని కూడా ఆయన నిర్వహించారు.

రాయలసీమ లో పారిశ్రామిక అభివృద్ధి కోసం రాగ మయూరి ఎల్సీక్ట్రానిక్స్ పార్కును తన కే.జే.ఆర్ గ్రూప్ ద్వారా అనంతపురం జిల్లా లో శంకు స్థాపన చేసారు.ఈ పార్కు ద్వారా పదివేల మందికి నేరుగా మరియు మరో ఇరవై ఐదు వేళా మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.అంతే కాకుండా కడప,కర్నూల్, అనంతపురంలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని నెలకొల్పి వాటి ద్వారా మరో ఐదు వేల మంది నిరుద్య్యోగులకు ఉపాధి కల్పించనున్నారు.

ఇలా ఎన్నో వ్యాపారాలలో విజయదుందుబి మోగించిన కేజే రెడ్డి గారు తన ను ఇంతవాన్ని చేసిన ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం తో ఈ మద్యే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసారు.అయన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా టి.డి.పి పార్టీ తరపున పోటీ చేయనున్నారు.పారిశ్రామికవేత్తగా మంచి పేరు ఉన్న ఈయన రాయలసీమ లో నిరుద్యోగ యువత కు ఉద్యోగ అవకాశాలను కల్పించి సీమ ను "పారిశ్రామిక సీమ"గా మార్చాలనే లక్ష్యం తో ముందుకు సాగుతున్నారు.

Close